ఝాన్సీలోని మెడిక‌ల్ కాలేజిలో అగ్నిప్ర‌మాదం.. 10 మంది చిన్నారులు మృతి

ల‌ఖ్‌న‌వూ (CLiC2NEWS): మెడిక‌ల్ కాలేజీలో ఉన్న నియోనాట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ఝాన్సీలోని మ‌హారాణి ల‌క్ష్మీబాయ్ మెడిక‌ల్ కాలేజిలో శుక్ర‌వారం రాత్రి 11.30 గంట‌ల‌కు ఒక్క‌సారిగా మంట‌లు అలుముకుని ప్ర‌మాదం సంభ‌వించింది. సిబ్బంది , రోగులు అంతా భ‌య‌బ్రాంతుల‌కు లోనై బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ప్ర‌మాదం స‌మ‌యంలో ఆస్ప‌త్రిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. మంట‌లు వ్యాపించ‌గానే త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను తీసుకుఒని బ‌య‌ట‌కు ప‌రుగెత్తారు. ఆస్ప‌త్రిలో ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకునిమంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

Leave A Reply

Your email address will not be published.