న్యూయార్క్ న‌గరంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. 19మంది మృతి

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 19 మంది మ‌ర‌ణించారు. మృతి చెందిన వారిలో 9 మంది పిల్ల‌లు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. న్యూయార్క్ న‌గ‌రంలో ఓ అపార్ట్‌మెంట్‌లో మంట‌లు చెల‌రేగాయి. రెండు, మూడు అంత‌స్తుల‌కు మంట‌లు వ్యాపించి మొత్తం అపార్ట్‌మెంట్ అంతా పొగ‌తో నిండిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని స్థానిక అసుప‌త్రికి త‌ర‌లించారు. మంటలు ఆర్ప‌టానికి 200 మంది ఫైర్ ఇంజ‌న్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.