సికింద్రాబాద్ రూబి హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం: ఎనిమిది మంది మృతి

హైదరాబాద్ (:) సికింద్రాబాద్ పాస్‌పోర్టు ఆఫీస్ సమీపంలో ఉన్న ఐదంతస్తుల రూబీ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ హోటల్ సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌లలో రూబి ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ఉంది. దీనిలో మంటలు చెలరేగి హోటల్‌లోకి మంటలు వ్యాపించాయి. లాడ్జిలో దట్టమైన పొగలు అలుముకుని ఊపిరాడక అక్కడున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హోటల్‌లో ఉన్న టూరిస్టులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. కొంత మంది కిటికీల నుండి కిందికి దిగారు.