సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున క్లబ్‌లో మంటలు చెలరేగి క్లబ్ మొత్తం దగ్ధమైంది. ఈప్రమాదంలో రూ. 20 కోట్ల మేర ఆస్తనష్టం జరిగినట్లు భావిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా క్లబ్ మూసివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక సిబ్బంది దాదాపు3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు..
1878వ సంవత్సరంలో బ్రిటీష్ మిలటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మించారు. 20వెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ క్లబ్ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ విడుదల చేశారు. ఐదువేల మందికి పైగా సభ్యత్వం ఉన్న ఈ క్లబ్‌లో దాదాపు300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.