వరంగల్ టెస్కో గోదాంలో భారీ అగ్నిప్రమాదం

వరంగల్ (CLiC2NEWS): ప్రభుత్వ వస్త్ర సంస్త (టెస్కో) గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో సుమారు రూ. 30 కోట్లు విలువైన వస్త్రాలు, సామాగ్రి ఉన్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారంలో ఉన్న టెస్కో గోదాంలో భారీగా మంటలు చెలరేగి గోడలు మొత్తం కూలిపోయాయి. 3 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు.