తిరుపతి గోవింరాజస్వామి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో నష్టం
తిరుపతి (CLiC2NEWS): తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఐదంతస్తుల భవనంలోని ఫొటో ప్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో రూ. కోట్ల విలువైన ఫోటోలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 3 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతం కావటం వలన మంటలు ఇళ్లవైపు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురువవుతున్నారు.
మంటలు వ్యాపించడంతో ఫొటో ప్రేమ్ వర్క్స్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మరికొందరు లోపల ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. భవనం ముందు ఉన్న ఐదు బైక్‌లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. మంటలు రథంవైపు వస్తుండటంతో.. అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు.