గుల్జార్ హౌస్ వద్ద అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

హైదరాబాద్ (CLiC2NEWS): ఆదివారం ఉదయం చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో మంటలు అలుముకున్న భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటి సిఎం ప్రటించారు.
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని, భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.