భారత్‌లో తొలి క్లేడ్1 మంకీపాక్స్ కేసు నమోదు

ఢిల్లీ (CLiC2NEWS): కేరళలోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తికి ‘క్లేడ్1బి స్ట్రైయిన్ మంకీపాక్స్ నిర్ధారణయ్యింది. అతను ఇటీవల యుఎఇ నుండి వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. గతవారం అతనికి క్లేడ్1గా నిర్దరణ అయ్యింది. ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లేడ్1బి స్ట్రైయిన్‌గా గుర్తించారు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.