‘రామారావు ఆన్ డ్యూటి’ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ మ్యాజిక్..

హైదరాబాద్ (CLiC2NEWS): రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటి ‘చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేశారు. తూలే గిరగిర మని బుర్రె ఇట్టా.. అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ తన మ్యాజిక్ వాయిస్‌తో శ్రోతలను ఫిదా చేశాడు. ఈ పాటకు రాకెందు మౌళి సాహిత్యం అందించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. ఇటీవలే స్పెయిన్‌లో ఈ చిత్రంలోని రెండు పాటలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో మాస్ మహారాజు రవితేజకు జంటగా దివ్యాంశ కౌషిక్, రాజిషా విజయన్ కాథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకులముందుకు రానున్నట్లు తెలుస్తోంది.