చంద్ర‌యాన్‌-3 తొలి ప‌రిశోధ‌న.. జాబిల్లిపై ఉష్టోగ్ర‌త‌ల ప‌రిశీల‌న‌..

బెంగ‌ళూరు (CLiC2NEWS): చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్ర‌యాన్‌-3 త‌న ప‌రిశోధ‌న‌లు మొద‌లుపెట్టింది. దీనికి సంబంధించిన మొద‌టి శాస్త్రీయ ప‌రిశోధ‌న వివ‌రాల‌ను ఇస్రో ప్ర‌క‌టించింది. చంద‌మామ ఉప‌రిత‌లంపై ఉష్ణోగ్ర‌తల గ‌ణాంకాల‌ను గ్రాఫ్ రూపంలో వెల్ల‌డించింది. విక్ర‌మ్ ల్యాండ‌ర్లోని చంద్రాస్ స‌ర్ఫేస్ థ‌ర్మో ఫిజిక‌ల్ ఎక్స్‌ప‌రిమెంట్ (చాస్టే) పేలోడ్‌.. చంద్రుడి ద‌క్షిణ ధ్రువంపై కాస్త లోతులో ఉష్ణోగ్ర‌త‌ల‌ను లెక్కిస్తుంది. 10 సెంటీమీట‌ర్ల లోతువ‌ర‌కు చొచ్చుకెళ్లి, ఉష్ణోగ్ర‌త‌ల‌ను లెక్క‌క‌ట్ట‌గ‌లిగే సామ‌ర్థ్యం ఈ పేలోడ్‌కు ఉంది.

ఇస్రో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. చంద్రుడి ఉప‌రిత‌లంపైన, కాస్త లోతులో న‌మోదైన ఉష్ణోగ్ర‌త వైవిధ్యాలకు సంబంధించిన గ్రాఫ్‌లో కనిపిస్తున్న‌ట్లు పేర్కొంది. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉష్ణోగ్ర‌త సుమారు 50 డిగ్రీల వ‌ర‌కు ఉంది. అదే 80 మిల్లీ మీట‌ర్ల లోతులో దాదాపు -10 డిగ్రీల వ‌ర‌కు ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.