IND vs BAN: బంగ్లాతో తొలి టి20.. భారత్ ఘన విజయం

గ్వాలియర్ (CLiC2NEWS): బంగ్లాదేశ్‌తో మూడు టి20 ల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టెస్టు మ్యాచ్‌ల్లోని విజయోత్సాహం కొనసాగిస్తూ.. టీ20 తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాజట్టుపై విజయం సాధించింది. ముందుగా బ్యాంటింగ్ చేసిన బంగ్లా జట్టు 127 పరుగులకే ఆలౌటయ్యింది. టీమ్ ఇండియా 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో టి20 ఢిల్లీ వేదికగా బుధవారం జరగనుంది.