ఐపిఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన ముంబయి ఇండియన్స్..
ఐపిఎల్ లో ముంబయి జట్టు 150 విజయం

IPL: ఐపిఎల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్.. ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ఐపిఎల్ లో ముంబయి జట్టు 150 విజయం అందుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. టోర్ని చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ముంబయి ఇండియన్స్ జట్టు రికార్డుల్లో నిలిచింది.
ఐపిఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు
ముంబయి ఇండియన్స్ – 150
చెన్నై సూపర్ కింగ్స్ -140
కోల్‌కతా నైట్ రైడర్స్ – 134
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 129
ఢిల్లీ క్యాపిటల్స్ – 112