తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు న్యూస్‌రీడర్ శాంతి స్వరూప్ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం యశోద హాస్పిటల్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన 1983 నవంబర్ 14 నుండి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. 2011 లో పదవీ విరమణ చేసే వరకు దూరదర్శన్‌లో పనిచేశారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఆయన పదేళ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్‌చూసి వార్తలు చదివేవారు.