బిఎస్ఎఫ్‌లో తొలి మహిళ స్నైపర్..

సిమ్లా (CLiC2NEWS): హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుమన్ కుమారి సరిహద్దు భద్రతా దళం ()లో తొలి మహిళా స్నైపర్‌గా చరిత్ర సృష్టించారు. మాటు వేసి, దూరం నుండే శత్రువుపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపే వారిని స్నైపర్‌లుగా పేర్కొంటారు. ఇందౌర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ () లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి.. ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. వాస్తవానికి స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా దృడంగా ఉండాలి. దీంతో ఒక్కోసారి పురుషులే వెనుకడుగేస్తారు. అలాంటిది ఆమె పట్టుదలను చూసిన అధికారులు అనుమతించారు. ఎనిమిది వారాల పాటు శిక్షణ తీసుకున్నారు. అక్కడ శిక్షణ తీసుకున్న 56 మందిలో సుమన్ కుమారి ఒక్కరే మహిళ కావడం విశేషం.
ఆమె 2021లో బిఎస్ ఎఫ్‌లో చేరిన సుమన్ కుమారి.. పంజాబ్‌లోని ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దుల వద్ద స్నైపర్ దాడుల ముప్పును గమనించారు. స్వచ్ఛందంగా కోర్సలో చేరేందుకు ముందుకొచ్చారు. ట్రైనింగ్‌లో ఎంతో ప్రతిభ కనపరిచారని, నేర్చుకోవాలన్న సంకల్పమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని శిక్షణాధికారులు సైతం ప్రశంసించారు. ఆమె స్నైపర్ శిక్షకురాలిగా ఆర్హత సాధించినట్లు సమాచారం. ఆమె సాధించిన ఘనతను చూసి.. మరింత మంది మహిళలు భద్రతా బలగాల్లో చేరేందుకు ఆశిస్తున్నట్లు తెలిపారు.