ఈతకు దిగి మున్నేరు వాగులో ఐదుగురు గల్లంతు.. ముగ్గురి మృతి
నందిగామ (CLiC2NEWS): మున్నేరు వాగులో సరదాగా ఈతకు దిగిన ఐదుగురు యువకులు నీటీలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు నీటిలో మునిగిన వారిని బయటకు తీశారు. వారిలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గరు పరస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌టిఆర్ జిల్లా కంచికర్ల మండలోని కీసర వద్ద ఉన్న మున్నేరు వాగులో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన వారు దినేశ్, యడవల్లి గణేశ్, గాలి సంతోష్ కుమార్‌గా గుర్తించారు. వీరు నందిగామ మండలం, ఐతవరం కు చెందిన వారు. సరదాగా ఈతకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా మారడంతో ఆ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.