యుపిలో కొలను తవ్వుతుండగా బయల్పడిన పంచముఖి శివలింగం
బదాయూ (CLiC2NEWS): ఉత్తరప్రదేశ్లో కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. బదాయూ జిల్లా దాతాగంజ్ తహీలు పరిధి సరాయ్ పిపరయా గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ లింగం దాదాపు 300 సంవత్సరాల కిందటిదని స్థానిక బ్రహ్మదేవ్ మందిర పూజారి మహంత్ పరమాత్మ దాస్ మహరాజ్ చెప్పారు.
ఈ లింగాన్ని చూడ్డానికి భారీగా ప్రజలు పోటెత్తారు. తామరు కొలను ఏర్పాటు చేయడంలో భాగంగా తన 13 ఎకరాల స్థలంలో ఈ తవ్వకాలు జరుపుతున్నట్లు పర్యావరణ వేత్త శివ్రా పాఠక్ తెలిపారు. కాగా ఈ శివలింగం పరిశీలినకు పురావస్తు అధికారులను ఆహ్వానించనున్నట్లు దాతాగంజ్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.