బాలికలతో బలవంతపు వ్యభిచారం..
ఐదుగురు ప్రభుత్వ అధికారులు అరెస్టు

ఇటానగర్ (CLiC2NEWS): మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఒకరు డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మరోకొరు డిప్యూటి డైరెక్టర్ ఆప్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారు. పోలీసులు మైనర్ బాలికలను రక్షించి వసతి గృహానికి తరలించారు.
ఇటానగర్‌లో బ్యూటి పార్లర్ నడిపే ఇద్దరు మహిళలు మైనర్ బాలికలను అరుణాచల్‌కు తీసుకొచ్చారని, చింపులో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ మే 4వ తేదీన అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఉద్యోగాల పేరిట ధేమాజి నుండి బాలికలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని బాలికలు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలికలను రక్షించి వసతి గృహానికి తరలించారు.