Accident: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/pedakura-accident.jpg)
నల్లగొండ (CLiC2NEWS): నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు మరొక వ్యక్తి మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపూర మండలంలోని నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు (28) ఆదివారం రాత్రి మోటర్‌సైకిల్‌పై మిర్యాలగూడ వెళ్తుండగా రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న సైదులు (55) ను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు ఇవాళ (సోమవారం ) తెల్లవారు జామున టాటా ఎస్ వెహికిల్‌లో ఘటనాస్థలికి బయల్దేరారు. వీరి వాహనం ప్రమాద స్థలికి 500 మీటర్ల దూరంలో ఓ ఆయిల్ ట్యాంకర్ వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో రమావత్ గున్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38), ప్రమాద స్థలంలోనే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.