మేఘాలయ సిఎం కార్యాలయంపై రాళ్లదాడి.. సిబ్బందికి గాయాలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/meghalaya-cm-office.jpg)
షిల్లాంగ్ (CLiC2NEWS): మేఘాలయ సిఎం ఆఫీస్‌పై కొంత మంది ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గారో హిల్స్‌కు చెందిన పౌర సమాజ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం పలువురు ఆందోళనకారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో సిఎం తో పాలు ఓ మంత్రి కార్యాలయంలోనే ఉండిపోయినట్లు సమాచారం. ఈ సమయంలో కొందరు కార్యాలయంపై రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సిఎం కన్రాడ్ సంగ్మా క్షేమంగానే ఉన్నారు.