కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో అప‌శృతి.. విద్యుత్ తీగ‌లు త‌గిలి ఐదుగురు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో కృష్ణాష్ట‌మి వేడుక‌లు నిర్వ‌హిస్తుండ‌గా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడుక‌ల్లో భాగంగా రామాంత‌పూర్‌లోని గోకులేన‌గ‌ర్‌లో ఆదివారం అర్ధ‌రాత్రి ఊరేగింపు నిర్వ‌హిస్తున్నారు. ఈ ఊరేగింపులో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలి ఐదుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ర‌థాన్ని లాగే వాహ‌నం ఆగిపోయింది. దానికి మ‌ర‌మ్మ‌తులు అవ‌స‌రం ఏర్పడింది. దాన్ని వ‌దిలేసి యువ‌కులు ర‌థాన్నిచేతుల‌తో లాగుతున్నారు. ఈ క్ర‌మంలో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలి 9 మంది కి షాక్ కొట్టింది. దీంతో ఆ తొమ్మిది మంది ఒక్క‌సారిగి దూరంగా విసిరేసిన‌ట్లు ప‌డిపోయారు. వీరంద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే ఐదుగురు మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన న‌లుగురికి చికిత్స‌నందిస్తున్నారు. గాయ‌పడిన వారికిలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి గ‌న్‌మెన్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం.

 

విద్యుత్ షాక్‌కు గురైన వ్య‌క్తిని కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్న స్థానికులు

 

శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌లు

Leave A Reply

Your email address will not be published.