Hyderabad: మియాపూర్ లో ఐదుగురి మృతి

హైద‌రాబాద్ (): హైద‌రాబాద్‌ (Hyderabad)లోని మియాపూర్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ తీ వ్ర విషాద ఘ‌ట‌న జ‌రిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారు.

కాగా స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచార‌ణ చేపట్టారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని పరిశీలించిన అనంత‌రం ఇది ఆత్మ‌హ‌త్య‌గా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ప‌లు కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న లో మృతి చెందిన వారు భార్య‌, భ‌ర్త‌, రెండేళ్ల చిన్నారి, అత్తా, మామ‌లుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా క‌ర్ణాట‌క (Karnataka)లోని గుల్బ‌ర్గా జిల్లా సేడం మండ‌లం రంజోలికి చెందిన ల‌క్ష్మ‌య్య (60), వెంక‌ట‌మ్మ (55), అనిల్ (32), క‌విత (24)తో పాటు రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read : నీటి కుంట‌లోకి దిగి ఆరుగురు చిన్నారులు మృతి

Leave A Reply

Your email address will not be published.