చెరువుకి ఈతకని వెళ్లి.. ఆరుగురు మృతి

మేడ్చల్ (CLiC2NEWS): జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువుకి సరదాగా ఈతకని వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీటమునిగి మరణించారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు, మరో వ్యక్తి మృతి చెందారు. మల్కాపురం ఎర్రగుంట చెరువులో పడి విద్యార్థులు మృతి చెందినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన వారు కాచిగూడలోని హనీఫా మదర్సాకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థులంతా 14 ఏళ్ల వయస్సులోపు వారే. విద్యార్థులను కాపాడేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడు కూడా నీట మునిగి మరణించాడు.