18 ఏళ్లుగా దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి
హైదరాబాద్ (CLiC2NEWS): ఓ హత్యకేసులో దుబాయ్‌లో 18 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు హైదరాబాద్ చేరకున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి మొదటగా పదేళ్ల జైలుశిక్ష పడింది. అనంతరం దుబాయ్ కోర్టు శిక్షను 25 ఏళ్లకు పెంచింది.
ముందు తెలంగాణ మాజి మంత్రి కెటిఆర్ నేపాల్ వెళ్లి, హతుని కుటుంబ సభ్యులకు రూ. 15 లక్షలు పరిమారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించారు. కానీ మారిన నిబంధనలతో కోర్టు అంగీకరింలేదు.అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరపు న్యాయవాదులు ప్రయత్నించగా.. ఏడేళ్ల ముందుగానే వారిని విడుదల చేసింది. సిరిసిల్ల, రుద్రంగి, కొనరావు పేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌కు చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత వారిని కలుసుకున్న కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.