జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్ (CLiC2NEWS): జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య 18 గంటలపాటు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. కుల్గాం జిల్లాలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారం మేరకు భద్రతాబలగాలు గురువారం రాత్రి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపగా.. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. రాత్రి సమయం కావడం.. అంతా చీకటి మయమవడంతో ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. మళ్లీ శుక్రవారం తెల్లవారుజామునుండి కాల్పులు మొదలయ్యాయి. మొత్తం 18 గంటలపాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది. ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు కారణంగా ఉగ్రవాదులు పొంచి ఉన్న ఇల్లు పూర్తిగా దహనమైపోవడంతో వారంతా బయటకు వచ్చినట్లు సమాచారం.