సిక్కింలో ఆకస్మిక వరదలు.. చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులు!
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/flash-floods-in-sikkim.jpg)
గాంగటక్ (CLiC2NEWS): సిక్కింలో గత మూడు రోజులనుండి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీరు వరదలై పారుతోంది. దీంతో జనజీవనం స్థంబించి పోయింది. ఆకస్మిక వరదల ధాటికి రోడ్డు కోట్టుకు పోవడంతో సిక్కిం జిల్లాలోని లాచెన్-లాచుంగ్ ప్రాంతంలో 2,400 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు సమాచారం. రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలియజేశారు. సహాయక బృందాలు సైతం చర్యలు చేపట్టాయి. విపత్తు నిర్వహణ సిబ్బంది.. పర్యాటకుల తరలింపుకు తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేశారు. వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులను తరలించేందుకు 19 బస్సులు, 70 చిన్న వాహనాలను సిద్దం చేసినట్లు అధికారులు వెల్లడించారు.