Hyderabad to Shirdi:. ప్ర‌త్యేక ప్యాకేజీతో విమాన యాత్ర

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌కాభివృద్ధి సంస్థ ( టిఎస్‌టిడిసి )రూ. 12,499 టికెట్ ధ‌ర‌తో హైద‌రాబాద్ నుండి శిర్డీకి విమాన‌యాత్రను ప్రారంభించింది. భోజ‌నం, వ‌స‌తి స‌దుపాయాలు కూడా ఈ ప్యాకేజీ కింద‌కే వ‌స్తాయి. హైద‌రాబాద్‌లో విమానాశ్ర‌యానికి తీసుకురావ‌డం.. శిర్డీలో అన్న ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు తీసుకెళ్లటం వంటివి కూడా దీనిలో భాగ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తిరోజూ హైదార‌బాద్ నుండి బ‌స్సులు ఉండ‌గా అద‌నంగా ఈ విమాన యాత్ర‌ను భ‌క్తుల‌కు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు టిఎస్‌టిడిసి ఎండి ప్ర‌క‌టించారు.

ప్యాకేజి వివ‌రాలు:

హైద‌రాబాద్ నుండి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి 2.30 గంట‌ల‌కు శిర్డీ చేరుకుంటారు.

హోట‌ల్‌లో బ‌స‌, సాయంత్రం 4.30 గంట‌ల‌కు సాయినాధుడి ద‌ర్శ‌నం..

సాయంకాలం ఆర‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం రాత్రి 7 గంట‌ల‌కు బాబా థీమ్ పార్కులోని సౌండ్ అండ్ లైట్ షో చూడ‌వ‌చ్చు.

రాత్రి బ‌స అనంత‌రం మ‌రుస‌టి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు పంముఖి గ‌ణ‌ప‌తి మందిర ద‌ర్శ‌నం ఉంటుంది.

పాత శిర్డీ, ఖండోబా మందిర్‌, సాయి తీర్థం ద‌ర్శ‌నాల అనంత‌రం త‌రిగి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

విమానంలో బ‌య‌లుదేరి 4 గంట‌ల‌కు హైదారాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకుంటారు.

దీనిలో ద‌ర్శ‌న టిక్కెట్లు ప్ర‌యాణికులు సొంత ఖ‌ర్చుల‌తో కొనుక్కోవాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు 98485 40371, 98481 25720 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.