జూన్ 13 నుండి విశాఖ-అబుదాబి విమాన స‌ర్వీసు ప్రారంభం..

విశాఖ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండి విదేశాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌. విశాఖ విమానాశ్ర‌యం నుండి అబుదాబికి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను వ‌చ్చే నెల 13 నుండి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. దేశీయంగా విశాఖ‌-భువ‌నేశ్వ‌ర్ మ‌ధ్య విమాన స‌ర్వీసు న‌డిపేందుకు ఒడిశా ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించింది. ఇది జూన్ 15 నుండి ప్రారంభ‌మ‌వుతుంది.

విశాఖ-అబుదాబి.. వారానికి నాలుగు రోజులు స‌ర్వీసు అందుబాటులో ఉంటుంది. సోమ‌, బుధ , శుక్ర‌, ఆదివారాల్లో ఉద‌యం 8.20 గంట‌ల‌కు విమానం విశాఖ విమానాశ్ర‌యానికి చేరుకొని అక్క‌డి నుండి ఉద‌యం 9.50 గంట‌ల‌కు అబ‌దాబికి ప‌య‌న‌మ‌వుతుంది.

విశాఖ‌-భువ‌నేశ్వ‌ర్ విమాన స‌ర్వీసు.. మ‌ధ్యాహ్నం 1.55కి విశాఖ చేరుకొని తిరిగి 2.25కి భువ‌నేశ్వ‌ర్‌కు వెళ్తుంది.

Leave A Reply

Your email address will not be published.