హిమాచ‌ల్‌లో వ‌ర‌ద బీభ‌త్సం.. కొట్టుకుపోయిన టూరిస్టులు!

సిమ్లా (CLiC2NEWS): హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వ‌ర్షం హోరెత్తింది. ఇక్క‌డ కురిసిన భారీ వ‌ర్షాల‌కు కులు జిల్లాలోని ప‌ర్వ‌తి లోయ‌లో ఉన్న‌చోజ్ ముల్లా వ‌ద్ద అక‌స్మాత్తుగా క్లౌడ్‌బ‌స్ట్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో స్థానిక చోజ్ గ్రామంలో న‌లుగురు గ‌ల్లంత‌యిన‌ట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శ‌ర్మ తెలిపారు. భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా కొంద‌రు టూరిస్టులు కొట్టుకుపోయి ఉంటార‌ని స్థానికులు భావిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో కులూ జిల్లా లో అక‌స్మాత్తుగా భారీగా వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. దీంతో ఇక్క‌డ అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ద ఉధృతిలో ఆరుగురు గల్లంత‌యిన‌ట్లు స‌మాచారం. సిమ్లా జిల్లా ధ‌ల్లీ ట‌న్నెల్ వ‌ద్ద కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఓ మ‌హిళ మృతిచెందింది. అలాగో చోజ్ గ్రామంలో లింకు ఉన్న బ్రిడ్జి ధ్వంసం అయింది.

Leave A Reply

Your email address will not be published.