వరదకు కొట్టుకుపోయిన పులిచింతల నం.16 గేటు

హైదరాబాద్ (CLiC2NEWS): పులిచింతల ప్రాజెక్టులోప్ర‌మాద‌వ‌శాత్తు గేటు ఊడిపోయింది. నీటి విడుద‌ల సంద‌ర్భంగా 16వ నంబర్ గేటు వరద ప్రవాహంతో కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్​లో సాంకేతిక సమస్య వల్ల గేటు ఊడిపోయింది. దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోతోంది.

దీతో లోతట్టు ప్రాంతాలైన మాదిపాడు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచించారు.

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌ట‌వ‌న‌రుల మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పులిచింత ప్రాజెక్టు వ‌ద్ద‌కు చేరుకుని ప‌రిశీలించారు. ప్ర‌త్యామ్నాయ ఏర్ప‌ట్ల‌పై అధికారుల‌తో మంత్రి చ‌ర్చించారు.

దీంతో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనున్నట్లు తెలిపారు. అధికారులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.