హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవేపై వ‌ర‌ద‌నీరు..

స్తంభించిన రాక‌పోక‌లు..

నందిగామ (CLiC2NEWS): గత కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు రోడ్ల‌పై నుండి వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తుంది. వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోతున్నాయి. ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారి 65 పై మున్నేరు వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తుంది. ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ, ఐత‌వ‌రం గ్రామ‌స‌మీపంలో వాహ‌నాలు నిలిపివేశారు. దీంతో రాక‌పోక‌లు స్తంభించిపోయాయి. దాదాపు రెండు కిలోమీట‌ర్ల వాహ‌నాలు నిలిచిపోయాయి. కంచిక‌ర్ల మండ‌లం విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ రాహ‌దారిపై కీస‌ర వంతెన వ‌ద్ద మున్నేరు వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది.

1 Comment
  1. […] హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవే… […]

Leave A Reply

Your email address will not be published.