బ్యాంకులోకి వ‌ర‌ద నీరు.. బంగారం, డ‌బ్బు ఏమైందోన‌ని ఆందోళ‌న‌

Flood Affect: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది ఆచూకీ తెలియ‌రాలేదు. ఇదిలా ఉండ‌గా.. మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలో ఉన్న కోఆప‌రేటివ్ బ్యాంక్‌లోకి వ‌ర‌ద‌నీరు చేరింది. దీంతో త‌మ డ‌బ్బు , బంగారం ఏమైందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఎనిమిది వేల మంది ఉండే ఆ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక బ్యాంకు అది. రెండంత‌స్తుల భ‌వ‌నం అది. రోజూ కోట్లాది రూపాయ‌ల లావాల‌దీవీలు జ‌రుగుతుండేవి. భారీ వ‌ర్షాలు కార‌ణంగా వ‌ర‌ద నీరు, కొట్టుకొచ్చిన శిథిలాలు మొద‌టి ఫ్లోర్ ను ముంచెత్తాయి. దీంతో ష‌ట్ట‌ర్లు దెబ్బ‌తిన్నాయి. దీంతో డిపాజిట‌ర్లు త‌మ డ‌బ్బు, న‌గ‌దుపై ఎటువంటి స‌మాచారం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర‌ద‌ల్లో ఏవైనా కొట్టుకుపోవ‌డం లేదా దోపిడీకి గురికావొచ్చ‌ని స్థానికులే కాప‌లాకాస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.