స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టండి.. సిఎస్, డిజిపికి పవన్‌కల్యాణ్ లేఖ

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కలదలికలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపికి ఆయన లేఖ రాశారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్‌సెల్స్‌పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దేశ మరియు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రంలో అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ సూచించారు.