హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పద్దు (2024-25)ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పద్దును సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు మంత్రి భట్టి. శంషాబాద్ విస్తరణకు రూ. 100 కోట్లు, ముసీ ప్రక్షాలనకు రూ. 1500 కోట్లు , ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు రూ. 1, 525 కోట్లు, పాత బస్తీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు ఔటర్ రింగ్ రోడ్డు కు రూ. 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రూ. 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ రూ. 3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ. 200 కో్టు కేటాయించారు.