ఎయిర్‌పోర్టులో పట్టుబడిన రూ. 75లక్షల విదేశీ కరెన్సీ
ముంబయి (CLiC2NEWS): దేశానికి అక్రమంగా విదేశీ కరెన్సీని తీసుకొస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి రెండు పుస్తకాలలో మొత్తం 90 వేల డాలర్ల విదేశీ కరెన్సీని పేపర్‌ల మధ్యలో అతికించాడు. వీటి విలువ దాదాపు రూ. 74 లక్షలు ఉంటుందని తెలిపారు. తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో సదరు వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతని లగేజి చెక్‌చేయగా నగదు బయటపడింది. ఆ డబ్బుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ప్రయాణికుడు 2.5 కేజీల బంగారాన్ని టూత్‌పేస్ట్ రూపంలో దాచి తీసుకొస్తుండగా అతడిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.