పద్మభూషణ్ అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సిఎం!
కోల్‌కతా (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రకటించిన విషయంతెలిసినదే. నలుగురికి పద్మభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ 107 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం వృద్ధ నేత బుద్ధదేవ్ భట్టాచార్య తనకు ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అవార్డు రావడం గురించి తనకేమీ తెలియదనీ… దీనిగురించి ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఇకవేళ పద్మభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసినట్లైతే, దానిని తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ , ప్రముఖ తబలా వాయిద్యకారుడు పండిత్ అనింద్య ఛటర్జీ తమకు ప్రకటించిన పురస్కారాలను తిరస్కరించారు. ఈ ముగ్గురూ కూడా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావటం గమనార్హం.