మాజి సిఎం కెసిఆర్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/KCR-DISHARGED-FROM-YASODA-HOSPITAL.jpg)
హైదరబాద్ (CLiC2NEWS): మాజి ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కెసిర్ శుక్రవారం ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదానికి గురై యశోద ఆస్సత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయనను రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు, అభిమానులు పరామర్సించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని కాక్షించారు. శుక్రవారం ఆస్పత్రి వైద్యులు ఆయను డిశ్చార్జ్ చేశారు. అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి వెళ్లారు.