మాజీ సిఎం రోశయ్య కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): ఉమ్మడి ఆంధ్ర్రపదేశ్ సిఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం ఉదయం ఇంట్లో పల్స్ పడివోవడంతో కుటుంబ సభ్యులు రోశయ్యను హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు..
రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య 1933లో జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు ఎన్జీ రంగా శిష్యుడైన ఆయన నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
- 1968లో తొలిసారి శాసన మండలికి ఎన్నికయ్యారు.
- 1968, 74, 80లో వరుసగా శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు.
- మర్రి చెన్నారెడ్డి సర్కార్‌లో ఆర్ అండ్ బి, రవాణా మంత్రి సేవలు అందించారు.
- 2004-2009 కాలంలో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
- కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతు నిర్వహించారు
- 2009 సెప్టెంబరు 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
- 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నరుగా బాధ్యతలు నిర్వర్తించారు.
- వయోభారంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
- ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.