ఝార్ఖండ్ మాజి సిఎం శిబూసోరెన్ క‌న్నుమూత‌

ఢిల్లీ (CLiC2NEWS): ఝార్ఖండ్ మాజి ముఖ్య‌మంత్రి శిబూసోరెన్ సోమ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా మూత్ర పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శిబూసోరెన్ .. ఝార్ఖండ్ పత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేశారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఝార్ఖండ్ ముక్తిమోర్చా అనే పార్టీని నెల‌కొల్పారు. ఝార్ఖండ్ నూత‌న‌ రాష్ట్రం ఏర్పాటైన అనంత‌రం శిబూసోరెన్ మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2004 నుండి 2006 వ‌ర‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఝార్ఖండ్ మాజి ముఖ్య‌మంత్రి శిబూసోరెన్ క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా మూత్ర పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శిబూసోరెన్ .. ఝార్ఖండ్ పత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేశారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఝార్ఖండ్ ముక్తిమోర్చా అనే పార్టీని నెల‌కొల్పారు. ఝార్ఖండ్ నూత‌న‌ రాష్ట్రం ఏర్పాటైన అనంత‌రం శిబూసోరెన్ మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2004 నుండి 2006 వ‌ర‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.