కాంగ్రెస్ గూటికి మాజి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి..

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ పార్టికి మ‌రో షాక్‌. మాజిమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి .. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి కండువా క‌ప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఖైరతాబాద్ డిసిసి అధ్య‌క్షుడు రోహిణ్ రెడ్డి తో క‌లిసి ఆయ‌న గాంధీభ‌వ‌న్‌కు వెళ్లారు. వెళ్లే ముందు బిఆర్ ఎస్ ప్రాథ‌మిక‌ సభ్య‌త్వానికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్‌కు పంపించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.