మాజీ మంత్రి వట్టివసంతకుమార్ కన్నుమూత
వైజాగ్ (CLiC2NEWS): ఉమ్మడి ఎపి మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైజాగ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వట్టి వసంతకుమార్ స్వగ్రామం ప.గో జిల్లా ఊల్ల గ్రామం. ఆయన ఉంగటూరు నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.