సిఎం కెసిఆర్‌తో ఒడిశా మాజీ సిఎం గిరిధర్ గమాంగ్ భేటీ
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఒడిశా మాజీ సిఎం గిరధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించినట్లు సమాచారం. సిఎం కెసిఆర్ బిఆర్ ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకలు చెందిన ముఖ్య నేతలు సిఎంను కలుస్తున్నారు. జాతీయ రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా బిఆర్ ఎస్ పార్టీ ఎపి అధ్యక్షుడిని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బిఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సభకు దేశంలోని పలు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.