పంజాబ్ మాజీ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత
అమృత్‌సర్ (CLiC2NEWS): పంజాబ్ మాజీ సిఎం, శిరోమణి అకాళీదళ్ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మొహాలీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. అతిచిన్న వయసులో పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన పంజాబ్‌కు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రముఖ పాత్ర పోషించారు.
1927 డిసెంబరు 8వ తేదీన ప్రకాశ్ సింగ్ బాదల్ రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని అబుల్ ఖురానా అనే గ్రామంలో జన్మించారు. తొలుత ఆయన రాజకీయ ప్రస్థానం గ్రామ సర్పంచ్‌గా మొదలుపెట్టారు. అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో కీలక నేతగా రాణించారు.
రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ సంతాపం
ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం దేశరాజకీయాలకు తీరని లోని పేర్కొన్నారు. బాదల్ కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.