ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా మాజీ స్పీకర్ పోచారం..
హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. పోచారం ఇటీవల బిఆర్ ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కేబినేట్ హోదాలో ఆయనను సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.