జీవితంలో ఎదుర‌య్యే ప‌రీక్ష‌ల్లో కూడా ఉత్తీర్ణుల‌వ్వాలి: మాజి జ‌స్టిస్ ఎన్‌వి ర‌మ‌ణ‌

గుడ్ల‌వ‌ల్లేరు (CLiC2NEWS): విద్యార్థులు జీవితంలో ఎదుర‌య్యే ప‌రీక్ష‌ల్లో కూడా ఉత్తీర్ణులు కావాల‌ని సుప్రీంకోర్టు మాజి జ‌స్టిస్ ఎన్ వి ర‌మ‌ణ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరులోని శేషాద్రి రావు ఇంజినీరింగ్ క‌ళాశాల 24వ గ్రాడ్యుయేష‌న్ డే సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జ‌స్టిస్ ఎన్‌వి ర‌మ‌ణ పాల్గొన్నారు. విద్యార్థుల‌కు గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాల‌ను అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ క‌ళాశాల‌లో జ‌రిగే ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన ప‌ట్ట‌బ‌ద్రులు .. జీవితంలో ఎదుర‌య్యే ప‌రీక్ష‌ల్లోనూ ఉత్తీర్ణులు కావాల‌ని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉద్యోగాల‌లు పొందిన త‌ర్వాత ఎక్క‌డున్నా స‌రే సొంత ప్రాంతాన్ని, సొంత భాష‌ను, సొంత త‌ల్లిని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. క‌ళాశాల‌ల్లో ప‌రీక్ష‌లు పాస‌వ‌డమే కాదు జీవితంలో ఎదుర‌య్యే ప‌రీక్ష‌లు కూడా పాస‌వ్వాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.

 

Leave A Reply

Your email address will not be published.