నాలుగు రోజులు ఎండమంటలు!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. భారీగా ఎండల తీవ్రత నమోదు అవుతుండటంతో మధ్యాహ్నం సమయంలో జనాలు రోడ్లమిద కనిపించడం తగ్గిపోయింది. మార్చి చివరలోనే ఎండల తీవ్ర త రికార్డు స్థాయిలో నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు.
కాగా రాష్ట్రంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని.. అదనంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచించారు.