కోనసీమ జిల్లా అమలాపురంలో లారీ, ఆటో ఢీకొని నలుగురు మృతి
అమలాపురం (CLiC2NEWS): ఆటోని లారీ బలంగా ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది ప్రయాణికులతో వెళ్లున్న ఆటోని చేపల లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు . ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి సమీపంలో చోటుచేసుకుంది. వీరంతా పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు యానం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. నులుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారు సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, వల్లూరి అజయ్, నల్లి నవీన్ కుమార్‌గా గుర్తించారు.