రామగుండంలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
పెద్దపల్లి (CLiC2NEWS): రామగుండంలో ఓ బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు. సింగరేణి రామగుండం ఆర్జీ-3 బొగ్గు గని పైకప్పు సోమవారం మద్యాహ్నం కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ సహా ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద స్థలంలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.