అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

వాషిగ్టన్ (CLiC2NEWS): అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్ డీసీలోని బేస్‌బాల్ స్టేడియం వెలుపల దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో్ మొత్తం నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. స్థానిక నేషనల్స్ పార్క్ బేస్‌బాల్ స్టేడియంలో శనివారం మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇక్కడ జరుగుతున్న బేస్‌బాల్ మ్యాచ్ వాషింగ్టన్ నేషనల్స్, సాన్‌డియాగో జట్ల మధ్య గేమ్ మొదలైంది. ఒక్కసారిగా స్టేడియంలో తుపాకీ కాల్పుల మోత మొదలైంది. ఆ శబ్దానికిప్రేక్షలకు ఒక్సారిగా బయటకు పరుగులు తీశారు. గుర్తుతెలియని దుండగులు జరిపిన 12 రౌండ్ల కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో అధికారులు మ్యాచ్‌ను రద్దుచేశారు.