ఇంటిపైకప్పు కూలి కుటుంబంలో నలుగురి మృతి

నాగర్ కర్నూలు (CLiC2NEWS): మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలోని నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్ల లో చోటుచేసుకుంది. ఇంటిలోపలి మట్టి మిద్దె కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు సహా తల్లి పద్మ మృతి చెందింది. తండ్రికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.