AP: ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్‌తో నలుగురి మృతి

ఉండ్రాజవరం (CLiC2NEWS): తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ప్లెక్సీలు కడుతుండగా ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్బంగా ప్లెక్సీలు కడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర , మారిశెట్టి మణికంఠ , కాసగాని కృష్ణగా గుర్తించారు. గాయాలైన కోమటి అనంతరావును చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.